Tuesday 3 April 2018

Hypertension -Lifestyle modificationఅధిక రక్త పోటు ని మన జీవన విధానం లో మార్పులు చేయడం

అధిక రక్త పోటు ని మన  జీవన విధానం లో  మార్పులు చేయడం ద్వారా కొంచెం వరకు మనం నియంత్రించవచ్చు : 

1. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం, ఉదాహరణ కి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పౌల్ట్రీ, చేపలు మరియు తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులను వాడటం..

2. ఆహారంలో ఉప్పును తగ్గించండి. 51 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు హైపర్ టెన్షన్, డయాబెటిస్ లేదా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి కలిగి ఉన్న వ్యక్తులకి సాల్ట్ రోజు కి 1,500 మిల్లీగ్రాములు (mg) సరిపోతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తులకి 2300 మీ. గ్రా అంతకంటే తక్కువ ఉప్పు ఆహారం లో ఉండేలా చూసుకోవాలి . నిల్వ ఉంచిన పచ్చళ్ళు లో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది అని గమనించండి


3. ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన బరువు ని కలిగి వుండండి. ఊబకాయం మరియు అధిక బరువు ని కలిగి ఉండటం అధిక రక్త పోటు కి దారి తీస్తుంది. మీ B.M.I (Body Mass Index) 18.6-24.9 ఉండేలా జాగ్రత్త పడండి.


4. క్రమం తప్పకుండ వ్యాయామం చేయడం తప్పనిసరి. రోజు కి కనీసం గంట వ్యాయామం లేదా అర గంట రన్నింగ్ శరీరాన్ని దృఢం గా ఉంచడమే కాకుండా హై బి.పీ రాకుండా కాపాడుతుంది.

5. మద్యపానాన్ని తగ్గించండి : వీలైనంత వరకు తీసుకోకపోవడమే మంచిది . ఎంత ఆరోగ్యం గా వున్నప్పటికి మద్యం సేవించడం వల్ల హైపర్ టెన్షన్ మాత్రమే కాక మూత్ర పిండ సంబంధిత రుగ్మతలు కొనితెచ్చుకోవడమే

6. ధూమపానం మీ ఆరోగ్యానికి మాత్రమే హానికరం కాదు, మీ చుట్టుపక్క వున్నవారికి కూడా. పొగాకు మన రక్త నాళాలను పూర్తిగా దెబ్బ తీస్తుంది . పొగ త్రాగడం వదల్లేక పోతున్నారా? అయితే వైద్యుని సాయం తీస్కోండి.


7. ఒత్తిడిని సాధ్యమైనంత తగ్గించండి. muscle relaxation , deep breathing exercise లేదా ధ్యానం వంటి పద్ధతులను పాటించండి . సరిపడ శారీరక శ్రమ మరియు పుష్కలమైన నిద్ర మంచి ఫలితాల్ని యిస్తుంది.


8. ఇంట్లో బ్లడ్ ప్రెషర్ check చేసుకోండి . ఒకవేళ బి.పీ లో ఏమైనా హెచ్చు తగ్గులు వున్నట్లైతే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి . మీ స్వయం గా మీరు మందులు వాడొద్దు. డాక్టర్ ని కలిసిన తర్వాతే మీ ఆహారపు అలవాట్లలో మార్పు లు చేయవచ్చు.


No comments:

Post a Comment

Featured post

వర్జిన్ కోకోనట్ ఆయిల్ (Virgin Coconut Oil) ఉపయోగాలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.

హాయ్!  ఈరోజు వర్జిన్ కోకోనట్ ఆయిల్(Virgin Coconut Oil)  గురించి తెలుసుకుందాం :  మార్కెట్ లో దొరికే సాధారణ కొబ్బరి నూనె కంటే ఇది విభి...