Sunday 15 April 2018

చిటెక లో జలుబు మరియు దగ్గు తగ్గిపోతుందా? Common "COLD" Symptoms,Treatment and Home Remedies.

చిటెక లో జలుబు , దగ్గు తగ్గుతుందా? సాధారణ జలుబుకు ఫ్లూ కి గల తేడా ఏమిటి? 


జలుబు, దగ్గు మన దైనందిన జీవితం లో అనేక రకాల ఇబ్బందులు కు గురిచేసి, మనశ్శాంతి లేకుండా  చేస్తుంది. జాబ్ చేసేటపుడు ఏకాగ్రత ను లోపించేలా చేస్తుంది. మన పక్కన వున్న వాళ్ళు కూడా విసుగుకుంటారు. అప్పుడే మనం చాలా తొందరగా తగ్గిపోయే మందుల కోసం వెదుకుతాం. అస్సలు చిటెక లో జలుబు తగ్గుతుందా ? అది తెలియాలంటే మనం జలుబు ఎలా వస్తుంది, ఎలా నివారించవచ్చు , చికిత్స ఏంటి అనేది తెలుసుకోవాలి. 

జలుబు ఒక్కసారి వచ్చిందంటే దాదాపు 7-10 రోజులు వరకు ఉంటుంది, కొన్ని సార్లు ఇంకా ముందు గానే తగ్గిపోవచ్చు . అది మన శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తి పై ఆధారపడి ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ గల వారికి జలుబు చాలా తరుచుగా వస్తూ ఉంటుంది మరియు వెంటనే తగ్గదు. 

సాధారణ జలుబు మరియు ఫ్లూ లక్షణాలు మొదట్లో ఒకేలా ఉంటాయి. రెండూ కూడా శ్వాసకోశ వ్యాధులు అయినప్పటికీ ఇంచుమించు ఒకేలాంటి లక్షణాలని కలిగిఉంటాయి. రెండు  వ్యాధులు  రెండు వేర్వేరు వైరస్ ల వల్ల వస్తాయి, కానీ క్రమేణా వాటి యొక్క లక్షణాల ఆధారం గా వ్యాధి ని నిర్ధారిస్తారు.  

సాధారణ జలుబు మరియు ఫ్లూ కలిగించే ఒకేరకమైన లక్షణాలు: 

⭆ ముక్కు దిబ్బడ,
⭆ విపరీతమైన తుమ్ములు,
⭆ ఒళ్ళు నొప్పులు,
⭆ సాధారణ అలసట,
⭆ తక్కువ డిగ్రీ లో జ్వరం. 
ఒకవేళ ఫ్లూ అని నిర్ధారణ అయితే , సాధారణ జలుబు కంటే ఇంకా తీవ్రమైన లక్షణాలు కలిగి వుంటుంది. రెండిటికి తేడా ఏంటంటే , వ్యాధి యొక్క లక్షణాల తీవ్రత పైన ఆధారపడి ఉంటుంది. సాధారణ జలుబు అయితే పైన పేర్కొనబడ్డ లక్షణాలు, లేదా అంతకంటే ఇంకాస్త ఎక్కువ తీవ్రత ని కలిగి ఉంటుంది. కానీ, ఫ్లూ మాత్రం సైనస్ , చెవి ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా, సెప్సిస్ వంటి ప్రమాదకర స్థితుల ను  తెచ్చును. 

వ్యాధి నిర్ధారణ కి వెంటనే వైద్యుని సంప్రదించండి , మీ లక్షణాలు ని , మీ మెడికల్ హిస్టరీ  ఆధారం గా అవసరమైన పరీక్షలు నిర్వహించి , మందులు తీస్కోండి. 
మీ వైద్యుడు ఒకవేళ సాధారణ జలుబు అని నిర్ధారిస్తే, ఉపశమనానికి మందులు వాడితే 2-3 లేదా 3-5 రోజుల్లో తగ్గిపోతుంది. ఎన్ని రకాల మందులు వాడినప్పటికీ చిటెక లో అయితే చికిత్స చేసి తగ్గించలేరు. 

ఫ్లూ అయితే ఉపశమనానికి వాడే మందులతో పాటు antivral మందులు నిర్ణీత సమయం వరకు వాడాల్సి వస్తుంది. దానితో పాటు శరీరానికి కావాల్సిన ద్రవపదార్థాల్ని  , మరియు రెస్ట్ తీసుకోవడం చాల ముఖ్యం. 

జలుబు లక్షణాలు: 

* ముక్కు నుంచి కారడం, 
* ముక్కు దిబ్బడ , 
* ఆహారం రుచిని మరియు వాసన ని కనిపెట్టలేక పోవడం. 
* తుమ్ములు,
* దగ్గు 
* చలి పెట్టడం, 
*  ఛాతి అసౌకర్యం  
*  Post Nasal drip  
*  Lymph node enlargement. 
* తలనొప్పి 
* కంటి నుంచి నీరు కారడం. 
* గొంతు నొప్పి 
* అలసట 
* ఒళ్ళు నొప్పులు 
* జ్వరం రావడం 
* శ్వాస తీసుకోవడం లో అసౌకర్యం

జలుబు నివారణ మరియు చిట్కాలు:
జలుబు మరియు దగ్గు వలన కలిగే సమస్యలు మనల్ని మనశ్శాంతిని కలిగించవు. వీటి నుండి త్వరగా ఉపశమనం పొందాలనుకుంటాము. ఇక్కడ తెలిపిన ఔషదాలు  ఈ సమస్యను దూరం చేస్తాయి

Over The Counter Medicine  జలుబు చికిత్స : 
సాధారణం గా జలుబు కి Decogestants , యాంటీహిస్టమిన్స్, మరియు పెయిన్ కిల్లర్స్ వాడుతారు. ఇవి కొన్నిసార్లు కాంబినేషన్ తో ఉంటాయి. ఏ మందులు అయినా  వైద్యుని సంప్రదించి, తీసుకోవడం  మంచిది. 

గృహ చిట్కాలు : 


1. గోరు వెచ్చని నీటిలో, చిటికెడు ఉప్పు వేసి  నోరు బాగా పుక్కిలించడం. ఇలా రోజు కి వీలైనన్ని సార్లు చేయడం వల్ల  వెంటనే ఉపశమనం లభిస్తుంది. తగినంత ద్రవపదార్థాల్ని తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడం వల్ల తొందరగా కోలుకుంటాం. 


2. పసుపు: పసుపు కలిపిన పాలు తీసుకోవడం , ఇది భారతదేశం లో బాగా ప్రాముఖ్యం పొందిన ఆంటిబయోటిక్ అని చెప్పవచ్చు.  అంతే కాదు , ఇది ఆంటివైరల్, యాంటీఫంగల్, మరియు anti inflammatory లక్షణాలని విస్తృతం గా కలిగివుండటం వలన, రోజూ పాలలో ఒక చెంచా పసుపు కలుపుకుని తాగడం వల్ల జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. 

3. అల్లము : అల్లం కూడా బాగా ప్రాచుర్యం పొందిన ఔషధం, అల్లం తో చేసిన టీ తీసుకున్న వెంటనే జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. 

నివారణ : 

1. చేతులు శుభ్రం గా కడుక్కోండి. Antibacterial  ఏజెంట్స్ వాడటం వల్ల  ప్రమాదకర బాక్టీరియా , వైరస్ వంటి వాటినుండి కాపాడుకోవచ్చు . 

2. అపరి శుభ్రమైన ఆహారాన్ని తీసుకోకండి. 


3. జలుబు తో భాధ పడుతున్న వారి నుండి కాస్త దూరం గా వుండండి. తప్పనిసరి పరిస్థితులలో  మాస్క్ వాడండి, తరువాత చేతులని శుభ్రపరుచుకోండి. 



4. జలుబు దగ్గు తో భాధ పడుతున్నప్పుడు తప్పనిసరి గా మాస్క్ ని వాడండి, దగ్గుతున్నపుడు చేతిరుమాలు ని అడ్డు పెట్టడం వల్ల  ఇతరులకి వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు. 

Friday 13 April 2018

Sun stroke or Heat stroke వడ దెబ్బ అంటే ఏమిటి మరియు లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఖచ్చితం గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

Sun stroke or Heat stroke వడ దెబ్బ అంటే ఏమిటి మరియు లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఖచ్చితం గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?


వేసవి వచ్చిందంటే.. అందరికీ హడలే. ఎండాకాలం అంటే బయట మాత్రమే కాదు.. ఇంట్లో కూడా చాలా వేడి గా  ఉంటుంది. చెమట, ఉక్కపోత కారణంగా.. ఏమాత్రం అనుకూలంగా ఉండదు. ఎన్ని ఫ్యాన్లు, ఏసీలు ఉన్నా... ఒంట్లో వేడిగానే ఉంటుంది. ఇంట్లో ఉండటానికి కష్టమే, అలాగని బయటకు వెళ్లలేం. ఈ సమయం లోనే  శరీర ఉష్ణోగ్రత కూడా భారీగా పెరిగిపోతుంది. ఇలాంటి వేడి వాతావరణాన్ని తట్టుకోవడం ప్రతి ఒక్కరికీ ఛాలెంజింగ్ గానే ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే వడదెబ్బ అందరిని  బెంబేలెత్తిస్తుంది. 

వాతావరణ ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో చాలామంది వడదెబ్బ బారిన పడుతుంటారు. ఈ వడదెబ్బనే హీట్ స్ట్రోక్ లేదా సన్ స్ట్రోక్  అని అంటారు. కొంతమంది వడదెబ్బ ధాటికి ప్రాణాలే కోల్పోతుంటారు. తీవ్రస్థాయిలో ఉండే ఎండలకు వడదెబ్బ లేదా సన్ స్ట్రోక్ తగలకుండా.. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వడదెబ్బ లక్షణాలు తెలుసుకోవడం చాలా అవసరం. 


రెండు రకాల హీట్ స్ట్రోక్ ఉన్నాయి. 


1.Exertional హీట్ స్ట్రోక్ (EHS) అనేది సాధారణంగా వేడి వాతావరణంలో సుదీర్ఘమైన శారీరక శ్రమలో పాల్గొనే యువ వ్యక్తులలో సంభవిస్తుంది. 


2.Classic nonexertional Heat stroke(NEHS) సాధారణంగా ఇలాంటి వడదెబ్బ వృద్ధులు, దీర్ఘకాలికం గా అనారోగ్యం తో భాధ పడుతున్నవారు,మరియు పిల్లలు ఎక్కువ సేపు దీర్ఘకాలిక అధిక ఉష్ణోగ్రత లో గడిపినపుడు కలుగుతుంది.  ఇది చాల ప్రమాదకరం. వెంటనే శీతలీకరణ చికిత్స చేయడం ఆలస్యం అయితే మరణించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

హీట్ స్ట్రోక్ కి గల ఇతర కారణాలు: 
* Dehydration  (శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం) 
*మద్యం సేవించడం 
*కొన్ని రకాల మందుల సైడ్ ఎఫెక్ట్స్. (ఉదాహరణ కి అధిక మూత్ర విసర్జన, చెమట పట్టుట) 
* అదనం గా మరియు బిగుతు గా వున్న బట్టలు ధరించడం వల్ల కూడా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. 

హీట్ స్ట్రోక్ ని మనం ఎలా గుర్తించవచ్చు?

➥ హీట్ స్ట్రోక్ సాధారణంగా రెండు లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. వేడి తో కూడిన తిమ్మిరి మరియు వేడి తో కూడిన తీవ్ర అలసట.  ఈ రెండు పరిస్థితులు కండరాల తిమ్మిరి మరియు  అమితమైన చెమటలు ద్వారా సంభవిస్తాయి . 

➥ఈ పరిస్థితులు గమనించినప్పుడు నిర్లక్ష్యం చేసిన, గుండె వేగంగా కొట్టుకోవడం, వేగంగా శ్వాస తీసుకోవడం, మైకము, మరియు తలనొప్పి సంభవించవచ్చు.



శరీరం లో ఉష్ణోగ్రత 104͒ F-105͒ F లేదా 40͒ C - 40.5͒ C కు చేరినప్పుడు స్ట్రోక్ను తగ్గించటానికి శరీరానికి చెమటపట్టడం కూడా ఆగిపోతుంది.


➥హీట్ స్ట్రోక్ తో బాధపడుతున్న వ్యక్తి యొక్క చర్మం వేడి గా అయి మరియు పొడిబారుతుంది. చెమట పట్టడం తో పాటు, ఎరుపు రంగు అవుతుంది.


➥స్ట్రోక్-వంటి లక్షణాలు వడదెబ్బ లో సంభవిస్తాయి. త్వరగా మరియు సమర్థవంతంగా చికిత్స చేయకపోతే గందరగోళం, భ్రాంతులు, అనారోగ్యాలు, అవగాహన కోల్పోవడం, అవయవ నష్టం, కోమా, మరియు మరణం సంభవించవచ్చు; మానసికం గా దృఢం గా ఉండటం వలన హీట్ స్ట్రోక్ నుండి తొందరగా కోలుకోవడానికి సహాయపడతాయి.


➥తీవ్రమైన తలనొప్పి
➥కండరాల బలహీనత లేదా తిమ్మిరి,
➥వికారం మరియు వాంతులు ,
➥వేగవంతమైన హృదయ స్పందన, ఇది బలంగా లేదా బలహీనంగా ఉండవచ్చు,
➥వేగవంతమైన, నిస్సార శ్వాస,
➥శరీరం తేలిక గా ఉండటం, మరియు మైకం .

వేడి ఉన్నప్పటికీ చెమట లేకపోవడం
➥ఎరుపు, వేడి మరియు పొడి చర్మం,
➥గందరగోళం, నిర్లక్ష్యం, లేదా అస్థిరమైన వంటి ప్రవర్తనా మార్పులు
➥మూర్చ
➥స్పృహ కోల్పోవడం.

హీట్ స్ట్రోక్ ప్రథమ చికిత్స :



➤ఎవరైనా ఒక వ్యక్తి కి హీట్ స్ట్రోక్ అయిందని మీరు అనుమానించినట్లయితే, వెంటనే 108 కి కాల్ చేయండి లేదంటే వైద్య సహాయం ఆలస్యం అయితే ప్రాణాంతకం కావచ్చు.
➤పారామెడిక్స్ రావడానికి ఎదురుచూస్తూ ఉండకుండా ప్రథమ చికిత్సను ప్రారంభించండి. ఒక ఎయిర్ కండిషన్డ్ వాతావరణ నికి వ్యక్తిని తరలించు - లేదా కనీసం ఒక చల్లని, నీడ ప్రాంతం కి తరలించాలి. మరియు ఏ అనవసరమైన దుస్తులు వున్నచో తొలగించండి. ➤సాధ్యమైతే, వ్యక్తి యొక్క ముఖ్య శరీర ఉష్ణోగ్రతని తీసుకోండి మరియు దానిని 101 నుండి 102 డిగ్రీల ఫారెన్హీట్ వరకు చల్లబర్చాలి. (థర్మామీటర్లను అందుబాటులో లేక పోయిననప్పటికీ , ప్రథమ చికిత్సను ప్రారంభించటానికి వెనుకాడవద్దు.

ఒక స్పాంజి తీస్కుని చల్లని నీటితో శరీరం మొత్తం శుభ్రం చేయాలి. లేదా నీటి గొట్టం నుండి నీటితో తన చర్మం తడిసే లా చేయండి. ➥రోగి యొక్క armpits గజ్జలు, మెడ మరియు వెనుకకు ఐస్ పాకెట్స్ ఉంచండి. ఈ ప్రాంతాల్లో రక్తనాళాలు ఎక్కువ ఉంటాయి. వాటిని శీతలీకరణ చేస్తే శరీర ఉష్ణోగ్రత ను తగ్గించవచ్చు.
➥చల్లని నీటి తొట్టెలో స్నానం చేయండి.



Monday 9 April 2018

కొవ్వు మంచిదే...!! 

అధిక బరువు తో ఇబ్బంది పడుతున్నారా? 



అవునండీ..మీరు విన్నది నిజమే, మనం తీసుకునే రోజువారీ ఆహారం లో కాసింత కొవ్వు మంచిదే..!! 

మన రోజు వారి ఆహారపు అలవాట్లలో "కొవ్వు తో కూడిన ఆహరం" అనగానే, ఎక్కడ బరువు పెరుగుతామో అని భయపడి పక్కన పడేస్తాం. నిజానికి మన శరీరము  బరువు ప్రమాద స్థాయి కి  ఎప్పుడు పెరుగుతుందో తెలుసా? అయితే ఒక్కసారి గమనించండి, మన శరీరానికి తన రోజు వారి కార్యక్రమాలకి 1500 cal  శక్తి  కావాలనుకుందాం, కానీ మనం  ఆహరం ద్వారా 2500 cal  శక్తి  ని అందించాము , అపుడు మన శరీరం 1500cal  ని వినియోగించుకుని మిగిలిన  1000 cal  ని కొవ్వు రూపం లో భవిష్యత్ లో  శరీరం  యొక్క అవసరాలకి దాచి  ఉంచుకుంటుంది. ఇలా రోజూ ఆహారం అవసరానికి మించి  ఎక్కువ  తీసుకున్నట్లైతే మన శరీరం లో  కొవ్వు నిల్వలు పెరిగి అసాధారణ స్థాయి లో బరువు పెరగడం జరుగుతుంది. 

మీరు ఎంత  బరువు వున్నారో ఒక్కసారి గమనించండి, మీరు ఆరోగ్యకరమైన బరువు ని కలిగి వున్నారా లేదా అన్నది BMI calculator ద్వారా తెలుసుకోవచ్చు. దానికి మీ బరువు మరియు పొడవు ఎంత వున్నారో తెలిస్తే సరి, BMI calculator ద్వారా ఎంత వున్నారో సరిచూసుకోండి. 

  BMI  విలువ 
* <16 కంటే తక్కువ ఉంటే, Very Severely Underweight  
* 16.0 నుండి 16.9 అయితే severely Underweight  
* 17.0 నుండి 18.4 వరకు Underweight  
* 18.5 నుండి 24.9 వరకు ఆరోగ్యకరమైన బరువు ని కలిగియున్నారు. (Normal Weight) 
*25.0  నుండి 29.9 మధ్య లో ఉంటే Over weight  
*30.0 నుండి 34.9 వరకు "Obese class -1 "
*35.0 నుంచి 39.9 వరకు అయితే అది "obese class -2" 
*40< కంటే ఎక్కువ అయితే Morbid  Obesity  అని పిలుస్తారు. 


బరువు తగ్గాలనుకుంటున్నారా? అన్ని రకాల డైట్ ప్లాన్ లు ప్రయత్నించి విసిగిపోయారా? కొంగారు పడకండి . 
మీకు ఉపయోగపడే కొన్ని టిప్స్ ఇక్కడ వున్నాయి, ప్రయత్నించి చూడండి. 

1. Don't skip Your Meal : బరువు తగ్గడం కోసం కావాలని ఆహారాన్ని మానేయకండి. అది ప్రమాదకరం. 

2. కొంచెం ఆహారం అయినప్పటికీ చాలా తక్కువ  తక్కువ మోతాదు లో, ఎక్కువ సార్లు తీసుకోండి. ఇలా చేయడం వల్ల రోజు లో ఎక్కువ గా ఆకలి అవ్వదు. 

3. మీ ఆహారాన్ని ఇంట్లో నే తయారు చేసుకోండి. బయట ఫుడ్స్ కి ఆకర్షితమయ్యి అలవాటు పడకండి. 

4. ఆరోగ్యకరమైన ఫుడ్స్ ని ముందు గానే ఇంట్లో తయారు చేస్కుని వుండండి . అవసరమైనపుడు మల్లి మల్లి వండాల్సిన అవసరం లేకుండా, ఆకలి వేసినపుడు snacks  రూపం లో తినొచ్చు. 

5. మీరు తింటున్న డైట్ లో మనకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, ఫ్యాట్స్ సమపాళ్లలో  ఉన్నాయో లేదో సరిచూసుకోండి. (Balanced Diet) 

6. చిన్న ప్లేట్ లో ఆహరం తీసుకోండి. డైట్ కి ప్లేట్ పరిమాణం కి సంబంధం ఉందండి, ఇటీవల అసోసియేషన్ ఆఫ్ కన్స్యూమర్డ్ అండ్  రీసెర్చ్ వారు చేసిన పరిశోధనల ఆధారం గా, ప్లేట్ సైజు చిన్నది గా ఉండటం  వల్ల  మనం తీసుకునే ఆహరం పరిమాణం కూడా తగ్గడం గమనించారు.  తమాషా గా వుంది  కదూ ...!! 

7.   ఖాళీ కడుపు తో, ఆకలి తో  పార్టీ లకి  అస్సలు వెళ్ళకండి. ఏదైనా కాస్త ఆరోగ్యకరమైన snacks  తిని వెళ్ళండి. 

8. ఆహరం లో ఉప్పు మరియు చక్కర మోతాదు ని తగ్గించండి. 

9. పండ్లు మరియు కూరగాయలుని విరివి గా వాడండి. 

10. అధిక కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ ని తగ్గించండి. లేదా ఆపేయండి. 

11. మద్యం సేవించడం తగ్గించండి, వీలైతే మానేయడం ఇంకా మంచిది. 


అన్నిరకాల డైట్ ప్లాన్స్ ని ప్రయత్నించారా , అయినా ప్రయోజనం లేదా... అయితే ఈ క్రింది కారణాల ద్వారా కూడా బరువు తగ్గడం కొంచెం కష్టం అవొచ్చు. 

* బరువు తగ్గడానికి డైట్ ఒక్కటే కాదు, వ్యాయామం కూడా తప్పనిసరి. తగినంత వ్యాయామం లేకపోతే మీరు ఎంత డైటింగ్ చేసిన వ్యర్థమే.



* హార్మోన్ల ప్రభావం- థైరాయిడ్ వంటి హార్మోన్స్ టెస్ట్ ఒక్కసారి చేయించుకోండి. 

* Obstructive Sleep Apnea (OSA) - నిద్ర లో మీకు గురక (Snoring)రావడం, పగలు మత్తు గా ఉండటం , fatigue వంటి లక్షణాలు వున్నచో స్లీప్ స్టడీ (Polysomnography) అనే  టెస్ట్ ద్వారా నిర్ధారణ చేస్తారు. దీనివల్ల కూడా బరువు పెరుగుతూ ఉండొచ్చు.  

* మీరు వాడుతున్న మందు ల లో steroids వున్నపుడు కూడా బరువు పెరిగే అవకాశం వుంది. ఈ విషయం లో మందుల వాడకం గూర్చి  వైద్యుల సలహా  తీసుకోండి. 

* మీ లైఫ్ స్టైల్ లో stress  కి ఏమాత్రం చోటు ఇవ్వకండి. యోగా మరియు ప్రాణాయామా లాంటి  పద్ధతుల ద్వారా స్ట్రెస్ (stress ) ని కొంచెం తగ్గించవచ్చు. 

Weight loss Diet Plan బరువు తగ్గడం కోసం మీకొరకు ఇక్కడ ఆహారపు  ప్లాన్ తయారు చేయబడి వుంది.  

ఉదయం: 

6AM - Bullet Proof Coffee  అర్థం కాలేదా...? బులెట్ ప్రూఫ్ కాఫీ  ఎలా చేస్తారో తెలుసా? చాలా సులభం. 
1గ్లాస్ లో, సగం వరకు బ్లాక్ కాఫీ తీసుకోండి. (ఇందులో పాలు , చక్కర వేయకూడదు..  only డికాషాన్ ) మిగిలిన సగం డైరీ క్రీం ని తీసుకోవాలి. మిల్క్ క్రీం మనకు బయట మార్కెట్ లో సులభంగానే దొరుకుతుంది. మరియు వర్జిన్ కోకోనట్ ఆయిల్ ని 10ml  వేయండి. క్రమం గా 10ml నుండి 30ml వరకు పెంచుకోవచ్చు.రుచి కోసం కాస్త నిమ్మకాయ రసం వేసుకోండి. అంతే... 

Brief  గా , Bullet Proof Coffee తయారు చేయు విధానం : 
1 గ్లాస్ లో  1/2 బ్లాక్ కాఫీ (డీకాషన్ ) + 1/2 మిల్క్ క్రీం +10మి.లీ నుండి 30మి.లీ వరకు  వర్జిన్ కోకనట్ ఆయిల్. (రుచి కోసం కాస్త నిమ్మ రసం) - రోజు లో ఒక్కపూట మాత్రమే . 

7-8AM : అల్పాహారం : రెండు  కోడి గుడ్లు (యెల్లో సొన తో కూడా) - మీకు నచ్చిన విధం గా ఉడకబెట్టినవి లేదా ఫ్రై చేసింది లేదా బూర్జి టైపు అయినా పర్లేదు. 
ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే , 
1 జొన్న రొట్టె మరియు కూరగాయల కర్రీ.


10-11AM  : మధ్యలో ఆకలి వేస్తే బ్లాక్ కాఫీ తీసుకోండి. డికాషన్ మాత్రమే.


1-2PM  Lunch : ఒక కప్ నట్స్ తినండి . నట్స్ అంటే వేరు శనగలు, బాదాం, పిస్తా, ఆల్మండ్, cashew, ఆక్రోట్ మొదలగునవి. (30-40 గ్రాములు మాత్రమే) 

7-8PM  Dinner :  పచ్చి కూరగాయ ముక్కలు (పెద్ద ప్లేట్) వెజిటబుల్ సలాడ్ తినండి. కీరా, దోస, క్యారెట్,  ముల్లంగి, బీట్రూట్ వంటివి తీస్కోండి, రుచి కోసం కాస్త ఉప్పు, లేదా పెప్పర్ లేదా నిమ్మ రసం తీసుకోవచ్చు. 
దీనితోపాటు కచ్చితం గా 150 గ్రాములు చికెన్, లేదా మటన్, లేదా రొయ్యలు, లేదా చేపలు, లేదా కోడిగుడ్లు (యెల్లో తీయకుండా ), లేదా చీజ్, లేదా పనీర్, లేదా సోయా బీన్ తీసుకోవచ్చు.


గమనిక: 
*ఈ ఆహారపు నియమావళి సగటు ఆరోగ్యమైన మనిషి స్థూలకాయం తో భాధ పడుతున్నవారిని ఉద్దేశించి తయారుచేయబడింది. 

* పైన పేర్కొనబడిన డైట్ ప్లాన్ ప్రముఖ గుండె డాక్టర్స్ మరియు న్యూట్రిషనిస్ట్స్  చే సిఫారసు చేయబడింది.  అయినప్పటికీ మీ వ్యక్తిగత వైద్యున్ని సంప్రదించిన తర్వాత నే ఈ ప్లాన్ ని అమలు చేయండి. 

* ఇదివరకే మీరు మధుమేహం తో భాధ పడుతున్నారా? ఒక్కసారి మీ మందుల చిట్టి ని వైద్యునికి చూపించి ఆ తర్వాత ఈ డైట్ ని మొదలు పెట్టండి.ఎందుకంటే మీ షుగర్ మందులలో "sulfonylurea drugs మరియు త్వరిత గతిన sugars ని తగ్గించే ఇన్సులిన్" కనుక ఉంటే అందులో మీ డాక్టర్ మార్పులు చేసే అవకాశం వుంది. ఎందుకంటే ఈ ఆహారపు నియమావళి ద్వారా శరీరం లోని షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. 

* కిడ్నీ మరియు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు  మీ డాక్టర్ సలహా తీసుకోండి. 

* ఆహారపు నియమావళి తో పాటు తగినంత వ్యాయామం చేయాలి. ఎక్కువ గా బ్రిస్క్ వాక్ చేయడానికి మొగ్గు చూపండి.  వీలైతే స్టేషనరీ సైక్లింగ్ కూడా చేయండి. 

Sunday 8 April 2018

Constipation (మలబద్దకం ) బాధిస్తున్నదా?? Treatment with the changes in food style ఆహార అలవాట్లలో మార్పులు

మలబద్దకం మిమ్మల్ని బాధిస్తున్నదా??ఉపసమనానికి మన ఆహరం లో చిన్న మార్పులు చేస్తే సరి.. 

మీ కడుపులో సరిగా లేకపోతే ఆరోజంతా నరకంగా అనిపిస్తుంది.ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చు కాని, ఈ మలబద్దకం వల్ల నలుగురిలో ఉన్నప్పుడు, మీకే కాకుండా పక్కన వున్నా వారికీ  ఇబ్బందిగానే ఉంటుంది.అయితే కంగారుపడి,భయపడవలసిన అవసరం లేదు, మీరు తీసుకునే ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది.


➥పీచు పదార్దములు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి,దీని వల్ల ఈ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది. సామన్యముగా మనం పౌష్టికమైన  ఆహారం తీసుకోవడం కన్నా “జంక్ ఫుడ్” నే ఎక్కువగా ఇష్టపడతాము, కానీ ప్రతీ రోజూ మనం తీసుకునే ఆహారంలో 26 గ్రాముల పీచు పదార్దంతో కూడిన ఆహరం ఉండాలి.
➥సామన్యంగా ఈ మలబద్దకము, సరియైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, వ్యాయామం చేయకపోవడం వల్ల, మన తీసుకునే ఆహారంలో పీచు పదార్దం లేకపోవడం వల్ల, ఇంకా చాల కారణముల చేత వస్తుంది.దానికోసం మందులు వాడి మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం కన్నా,  పీచు పదార్దం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఈ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది.

➽పండ్లు , కూరగాయలు , బీన్స్ మరియు ధాన్యాలు:ఇవి అన్నీ అధిక శాతంలో పీచు పదార్దం కలిగి ఉన్నవే, అయితే సరియైన పౌశ్టికమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది.ఆకులు, పండ్లు, పండ్ల యొక్క  పై తొక్క భాగములో ఎక్కువగా మీకు పీచు పదార్దం లభిస్తుంది. ఆపిల్ పండులోని తొక్కను తీయకుండా తీసుకుంటేనే మంచిది,పచ్చి కూరగాయలు, ఆకుకూరలలో పీచు పదార్దమే కాదు శరీరానికి కావలసిన మెగ్నీషియం కూడా లభిస్తుంది.

కార్న్:కార్న్ చాలా ఆరోగ్యకరమైన ఆహారం మరియు ఫైబర్ అనే గొప్ప వనరు కలిగి ఉంది. ఒక అర కప్పు మొక్కజొన్న కార్న్  లో 2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీనిలో విటమిన్ B,ముఖ్యంగా థయామిన్ మరియు నియాసిన్ మరియు వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు వంటి చాలా మంచి వనరులు ఉన్నాయి..


వైట్ బీన్స్:మీరు ఫైబర్ ను పూర్తిగా ఒక ఆరోగ్యకరమైన ఆహారంగా తినాలని కోరుకుంటే మీ మెనూ లో తప్పనిసరిగా తెలుపు బీన్స్ ఉండాలి. తెలుపు బీన్స్ లో ఫైబర్ పాటు ఒక మంచి ప్రోటీన్,ఇనుము మరియు పొటాషియం ఉంటాయి.


ఓట్స్:  ఓట్స్లో ఉన్న ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించుట మరియు మీ జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది.ఇది కూడా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించటానికి సహాయపడుతుంది. అంతేకాక రోగనిరోధక వ్యవస్థ పనితీరును పెంచటానికి బీటా-గ్లూకాన్ కలిగి ఉంటుంది..

బ్లాక్ బీన్స్:బ్లాక్ బీన్స్ ఒక రుచికరమైన ఆహారం మాత్రమే కాకుండా మీ శరీరంనకు అందించడానికి అనేక పోషకాలను కలిగి ఉంది. ఒక కప్పు బ్లాక్ బీన్స్ లో 15 గ్రాముల ఫైబర్ మరియు ప్రోటీన్ ఉంటుంది. దీనిలో కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు చాలా సమృద్ధిగా ఉన్నాయి.

శనగలు:భారతదేశం శనగలు యొక్క అతి పెద్ద ఉత్పత్తిదారు అని మీకు తెలుసా? దీనిలో ఫైబర్ యొక్క ఒక గొప్ప వనరు ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని నుండి అన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది మధ్య తూర్పు మరియు యునైటెడ్ స్టేట్స్ లో చాలా ప్రసిద్ది.

అవకాడో : అవెకాడో పండు ఈ పండు ఫైబర్ యొక్క చాలా మంచి వనరుగా చెప్పవచ్చు. మొత్తం పండులో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ పండులో క్రీమీ ఫ్లెష్ ఉండుట వల్ల కొలెస్టరాల్ తగ్గించటానికి సహాయం చేస్తుంది మరియు గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతేకాక మంచి కొవ్వులు కలిగి ఉంటుంది.

 బ్రోకలీ:మీరు అనేక వంటకాల్లో బ్రోకలీని తప్పనిసరిగా వాడాలి. ఇది ఫైబర్ యొక్క ఒక గొప్ప మూలం మరియు క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.ఒక కప్పు ఉడికించిన బ్రోకలీలో 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది.


బార్లీ : అవును,కేవలం బార్లీ బీర్ మరియు విస్కీల ఒక ముడి పదార్ధం కాదు. కానీ దీనిలో ఫైబర్ యొక్క ఒక గొప్ప మూలం ఉంది. గుండె వ్యాధులు ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రసిద్ధి చెందింది. ఇది బీటా గ్లూకాన్ యొక్క ఒక మంచి మూలంను కలిగి ఉంది. మీరు మీ అల్పాహారంలో బార్లీ తీసుకుంటే మీకు రోజు ఆకలి తక్కువ  ఉన్న అనుభూతి కలుగుతుంది.. 
ఎండు ద్రాక్ష: ఈ మల బద్దక సమస్యకు ఎండు ద్రాక్ష ఎంతో ఉపయోగపడుతుంది, దీనిలో ఉన్న లక్షణాలు మన కండరాలను ఉత్తేజపరచి, పెద్ద ప్రేగు ద్వారా వ్యర్ద పదార్దాలని పంపించేస్తుంది.5 ఎండు ద్రాక్షలో 3 గ్రా.ము పీచు పదార్దం ఉంటుంది.

కాఫీ మరియు ఇతర వేడి ద్రవాలు: కాఫీ మన ఆరోగ్యానికి ఏ రకంగాను సహయపడక పొయిన మనలోని ఒత్తిడిని తగ్గించి, మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.అయితే ఈ మలబద్దక సమస్య నిర్మూలనలోను కాఫీ ఎంతగానో సహాయపడుతుంది, అంతే కాకుండా ఇతరత్రా వేడి పదార్దాలు తీసుకోవడంలోను ఈ సమస్య నుంచి మంచి ఫలితం లభిస్తుంది.

నీరు: మనం పీచు పదార్దం ఎంత తీసుకున్నప్పటికీ, దానికి తోడు నీరు కూడా తీసుకోవాలి,లేదంటే కడుపులో ఉన్న వ్యర్ద పదార్దాలు శుబ్ర పడకుండా అధిక నొప్పితో మలబద్దకముకు దారి తీస్తుంది.పండ్ల ముక్కల్ని నీటితో కలిపి తీసుకుంటే  మంచి ప్రభావం చుపిస్తాయి.

రాత్రి పూట పడుకునే ముందు 1 గ్లాసు వేడి పాలు తాగి పడుకుంటే మీ జీర్ణాశయం శుబ్రపడి, మంచి ప్రబావం చుపిస్తుంది.

గమనిక: 


ఒకవేళ పైన చెప్పిన ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నప్పటికీ మలబద్దకం తీవ్రత తగ్గకపోతే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం శ్రేయస్కరం.  


- చికిత్స చేయని యెడల శరీరం లో అమ్మోనియా స్థాయి పెరుగుతుంది. తద్వారా ఎప్పుడు మత్తు గా  ఉండటం, నీరసం గా ఉండటం గమనించవచ్చు . 

- మొలలు ఏమైనా వున్నపుడు వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోండి. 

- పేగు కి సంబందించిన ఏ ఇతర సమస్యలు అయినా కాలోనోస్కోపీ (colonoscopy) అనే టెస్ట్ ద్వారా తెలుస్తుంది. 


Saturday 7 April 2018

ఆల్కహాల్ విత్ డ్రాయల్ సిండ్రోమ్ (Alcohol Withdrawal Syndrome)అంటే ఏమిటి? అకస్మాత్తుగా ఆల్కహాల్ తీసుకోవడం ఆపు చేస్తే ప్రమాదమా?

ఆల్కహాల్ విత్ డ్రాయల్ సిండ్రోమ్ అంటే   ఏమిటి? అకస్మాత్తుగా ఆల్కహాల్ తీసుకోవడం ఆపేస్తే  ప్రమాదమా? 


ఆల్కహాల్ విత్ డ్రాయల్ సిండ్రోమ్ అంటే అనేక ప్రమాద లక్షణాల కలయిక . వ్యాధి యొక్క లక్షణాలు నిరంతరం ఆల్కహాల్ తాగే అలవాటు గల వ్యక్తులను ప్రభావితం చేస్తాయి. 

వీరు అకస్మాత్తు గా ఆల్కహాల్ ని తీసుకోవడం ఆపు చేయలేరు , అలాగని మోతాదు ని తగ్గించలేరు. వీరిలో వారి సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ (కేంద్ర నాడీ వ్యవస్థ) శరీర రక్త ప్రవాహం లో ఆల్కహాల్ ఉనికి కి అలవాటు పడిపోతుంది . ఆల్కహాల్ తీసుకున్నపుడు వీరి మెదడు యొక్క డిప్రెషన్ ప్రభావాల్ని తగ్గి , అసాధారణ స్థితి లో ఆక్టివ్ అవుతుంది. 

ఎప్పుడైతే , శరీరం లో  ఆల్కహాల్ స్థాయి తగ్గిపోయినప్పుడు , మెదడు అధిక ఉద్రేక స్థితి లో ఉండిపోతుంది, దాని లక్షణాలు శరీరం పై చూపుతుంది . 


కారణాలు ( Causes) : 

ఎక్కువ  గా ఆల్కహాల్ ని తాగడం వలన మెదడు లోని నాడీకణాలు ( సందేశాలు ను ప్రసారం చేసే రసాయనాలు) కు  అంతరాయం కలుగుతుంది. ఆల్కహాల్ వలన నాడీకణాల యొక్క  పనితీరు మరియు న్యూరాన్ కార్యాచరణ ని  క్రమేణా తగ్గిస్తూ వస్తుంది .  తద్వారా ఆల్కహాల్ ని తీసుకోవడం వల్ల అసాధారణ , అసంబద్ధమైన ఉద్రేక ప్రవర్తన ని కలగజేస్తుంది. ఇలా ఎక్కువ రోజులు ఆల్కహాల్ ని తీసుకోవడం వల్ల బ్రెయిన్ యొక్క నాడి వ్యవస్థ స్పందన  తగ్గుతుంది . మరియు కావాల్సిన ప్రభావాన్ని పొందడానికి  అధికం గా ఆల్కహాల్ ని తీసుకోవాల్సి వస్తుంది . ఆల్కహాల్ మీద ఆధారపడి జీవించాల్సి వస్తుంది ,  ఈ స్థితి నే  ఆల్కహాల్ డిపెండెన్సీ సిండ్రోమ్ ( Alcohol Dependency Syndrome) అని  అంటారు. 

ఆల్కహాల్ విత్ డ్రాయల్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఆందోళన, చికాకు, మరియు వణుకుడు, మూర్ఛ రావడం . 




😰లక్షణాలు (Symptoms): 


ఆల్కహాల్ విత్ డ్రాయల్ లక్షణాల స్వభావం మరియు దాని యొక్క తీవ్రత ఆ వ్యక్తి ఇదివరకు ఎంత మోతాదు లో మరియు ఎంత కాలం గా ఆల్కహాల్ ని తాగుతున్నారో వాటి యొక్క అంశాలపై ఆధారపడి ఉంటుంది. 

ఈ లక్షణాలు సాధారణం గా ఆల్కహాల్ ఆపివేసిన లేదా మోతాదు ని తగ్గించిన కొన్ని గంటల్లోనే కనిపించవచ్చు.

ఉదాహరణ కి,

  • వణుకుడు,😰
  • వెంటనే ఆల్కహాల్ ని తాగాలనే బలమైన  కోరిక, 😌
  • నిద్ర పట్టకపోవడం,😪
  • విచిత్రమైన కలలు , ( Nightmares) 😨😱
  • ఆతురత (Anxiety)😲, 
  • చికాకు ( Irritation), 😡
  • ఆకలి మందగించడం , 😷
  • వికారం మరియు వాంతులు, 😷
  • తలనొప్పి, 😬
  • చెమటలు పట్టడం.. 😠




➽వ్యక్తి ఆల్కహాల్ ని ఆపివేసిన 12 నుంచి 24 గంటల తర్వాత వారు శ్రవణ, దృశ్య లేదా స్పర్శ సంబంధిత మతిభ్రమణ ల ను అనుభవించవచ్చు . ఈ లక్షణాలు సాధారణం గా 48 గంటల్లో సమసిపోతాయి. ఈ స్థితి నే ఆల్కహాల్ మతిభ్రమ అంటారు.

➽ఆల్కహాల్ మానేసిన 24 నుంచి 48 గంటల్లో మూర్ఛలు రావడం కూడా గమనించవచ్చు. కొన్నిసార్లు ఇవి కేవలం 2 గంటల్లోనే సంభవంచడం చూడొచ్చు.

➽గందరగోళం , గుండె వేగం గా కొట్టుకోవడం ( పాల్పిటేషన్స్ ) మరియు జ్వరం వంటి డెలీరియం ట్రేమోర్స్  లక్షణాలు సాధారణం గా ఆల్కహాల్ ఆపేసిన 2-4 రోజుల్లో ప్రారంభమవుతాయి.

➽వీటితో బాధపడుతున్న వారు సుమారు 1-5% మంది రోగులు మెటబోలిక్ లేదా గుండె సంబంధిత సమస్యలు , ఇన్ఫెక్షన్స్ మరియు గాయం వలన మరణిస్తారు.



ఎలా నిర్ధారిస్తారు? ( Diagnosis) 

డాక్టర్ కి  మీ సమస్యలు గురించి చెప్పడానికి సంకోచించకండి. మీరు ఎన్ని రోజులనుండి ఆల్కహాల్ ని తాగుతున్నారు? మరియు ఎంత మోతాదు రోజుకి తీసుకుంటున్నారో చెప్పండి. మరియు ఆల్కహాల్ చివరిసారి ఎప్పుడు  తీసుకున్నారో కూడా చెప్పండి. 

శారీరకం గా పరీక్ష చేసి , మీ వైద్య చరిత్ర ను  పరిశీలించిన పిమ్మట ,మీకు అవసరమైన టెస్ట్ లు చేయించాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్ , సంపూర్ణ రక్త కణాల సంఖ్య , ఎలెక్ట్రోలైట్స్ , ఆల్కహాల్ స్థాయి మొదలగును రక్త పరీక్ష లు , అలాగే మూత్ర విశ్లేషణ ని కూడా సిఫారసు చేయవచ్చు. ఆల్ట్రాసౌండ్ స్కాన్ కూడా అవసరం అవుతుంది. 

వీటి ఫలితాలు ఆధారం గా ఆల్కహాల్ విత్ డ్రాయల్ అవునో కాదో , ఒకవేళ అయితే అది ఏ స్థాయి లో ఉందొ కూడా నిర్ధారించుకోవచ్చు. 



చికిత్స: (treatment ) 

ఏదైనా చికిత్స ని మొదలుపెట్టేముందు రోగి యొక్క విత్ డ్రాయల్ లక్షణాలు దశ ని క్షుణ్ణం గ అంచనా వేయాలి. మానసికమైన సమస్యలు కూడా  ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. 

కొద్దిపాటి నుండి మిత స్థాయి కి విత్ డ్రాయల్ లక్షణాలు వున్నట్లైతే వైద్యులు అవుట్ పేషెంట్ విధానం లోనే చికిత్స చేస్తారు. ఇంపేషెంట్  డీ టాక్సిఫికేషన్ తో పోల్చినపుడు అవుట్ పేషెంట్ చికిత్స అనేది సులభం. , సురక్షితం , సౌకర్యవంతం, ప్రభావవంతం కూడా. 

కింది సందర్భాల్లో ఇన్ పేషెంట్ విధానం   లో చికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు. 

➤రోగి ఒకవేళ గర్భిణీ మహిళా అయినపుడు, 

➤తీవ్రమైన విత్ డ్రాయల్ లక్షణాలు , విత్ డ్రాయల్ మూర్ఛలు వంటి చరిత్ర కలిగి వున్నపుడు,

➤మానసికమైన పరిస్థితులతో భాధపడుతున్నపుడు , 

➤డాక్టర్ లు వణుకుడు , ఆందోళన, మరియు గందరగోళాన్ని అదుపు లో ఉంచడానికి మరియు మూర్ఛలు మరియు డీటాక్సిఫికేషన్స్ యొక్క ప్రమాదవకాశాలను తగ్గించడానికి ఉపశమన మందులు సూచించవచ్చు. 




డాక్టర్స్ ఈ కింది మందుల్ని సూచించవచ్చు : 


  • మూర్ఛ నుంచి ఉపశమనం కోసం యాంటీ కన్వెల్సంట్ ఏజెంట్స్ 
  • ఆందోళన నుంచి ఉపసమనం పొందడానికి యాంటీ సైకోటిక్స్ మందులు 
  • పెరిగిన రక్త పోటు ని తగ్గించడానికి బీటా - బ్లాకెర్స్ 


నివారణ: ( prevention ) 


  • 1. విత్ డ్రాయల్ లక్షణాలకి పూర్తిగా చికిత్స తీసుకోవడం. 
  • 2. ఆల్కహాల్ విత్ డ్రాయల్ సిండ్రోమ్ సంభవించడానికి అంతర్లీన కారణం ఆల్కహాల్ వ్యసనం . కనుక , రోజు ఎక్కువ మోతాదు లో ఆల్కహాల్ ని తాగకుండా ఉండటం వల్ల దీనిని నివారించవచ్చు. 
  • 3. ఆల్కహాల్ వ్యసనం కోసం వైద్య సహాయం ముందే  తీసుకోవడం వలన సమస్యల తీవ్రత కొంచెం వరకు తగ్గించవచ్చు. 



Featured post

వర్జిన్ కోకోనట్ ఆయిల్ (Virgin Coconut Oil) ఉపయోగాలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.

హాయ్!  ఈరోజు వర్జిన్ కోకోనట్ ఆయిల్(Virgin Coconut Oil)  గురించి తెలుసుకుందాం :  మార్కెట్ లో దొరికే సాధారణ కొబ్బరి నూనె కంటే ఇది విభి...