Sunday 8 April 2018

Constipation (మలబద్దకం ) బాధిస్తున్నదా?? Treatment with the changes in food style ఆహార అలవాట్లలో మార్పులు

మలబద్దకం మిమ్మల్ని బాధిస్తున్నదా??ఉపసమనానికి మన ఆహరం లో చిన్న మార్పులు చేస్తే సరి.. 

మీ కడుపులో సరిగా లేకపోతే ఆరోజంతా నరకంగా అనిపిస్తుంది.ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చు కాని, ఈ మలబద్దకం వల్ల నలుగురిలో ఉన్నప్పుడు, మీకే కాకుండా పక్కన వున్నా వారికీ  ఇబ్బందిగానే ఉంటుంది.అయితే కంగారుపడి,భయపడవలసిన అవసరం లేదు, మీరు తీసుకునే ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది.


➥పీచు పదార్దములు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి,దీని వల్ల ఈ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది. సామన్యముగా మనం పౌష్టికమైన  ఆహారం తీసుకోవడం కన్నా “జంక్ ఫుడ్” నే ఎక్కువగా ఇష్టపడతాము, కానీ ప్రతీ రోజూ మనం తీసుకునే ఆహారంలో 26 గ్రాముల పీచు పదార్దంతో కూడిన ఆహరం ఉండాలి.
➥సామన్యంగా ఈ మలబద్దకము, సరియైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, వ్యాయామం చేయకపోవడం వల్ల, మన తీసుకునే ఆహారంలో పీచు పదార్దం లేకపోవడం వల్ల, ఇంకా చాల కారణముల చేత వస్తుంది.దానికోసం మందులు వాడి మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం కన్నా,  పీచు పదార్దం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఈ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది.

➽పండ్లు , కూరగాయలు , బీన్స్ మరియు ధాన్యాలు:ఇవి అన్నీ అధిక శాతంలో పీచు పదార్దం కలిగి ఉన్నవే, అయితే సరియైన పౌశ్టికమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది.ఆకులు, పండ్లు, పండ్ల యొక్క  పై తొక్క భాగములో ఎక్కువగా మీకు పీచు పదార్దం లభిస్తుంది. ఆపిల్ పండులోని తొక్కను తీయకుండా తీసుకుంటేనే మంచిది,పచ్చి కూరగాయలు, ఆకుకూరలలో పీచు పదార్దమే కాదు శరీరానికి కావలసిన మెగ్నీషియం కూడా లభిస్తుంది.

కార్న్:కార్న్ చాలా ఆరోగ్యకరమైన ఆహారం మరియు ఫైబర్ అనే గొప్ప వనరు కలిగి ఉంది. ఒక అర కప్పు మొక్కజొన్న కార్న్  లో 2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీనిలో విటమిన్ B,ముఖ్యంగా థయామిన్ మరియు నియాసిన్ మరియు వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు వంటి చాలా మంచి వనరులు ఉన్నాయి..


వైట్ బీన్స్:మీరు ఫైబర్ ను పూర్తిగా ఒక ఆరోగ్యకరమైన ఆహారంగా తినాలని కోరుకుంటే మీ మెనూ లో తప్పనిసరిగా తెలుపు బీన్స్ ఉండాలి. తెలుపు బీన్స్ లో ఫైబర్ పాటు ఒక మంచి ప్రోటీన్,ఇనుము మరియు పొటాషియం ఉంటాయి.


ఓట్స్:  ఓట్స్లో ఉన్న ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించుట మరియు మీ జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది.ఇది కూడా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించటానికి సహాయపడుతుంది. అంతేకాక రోగనిరోధక వ్యవస్థ పనితీరును పెంచటానికి బీటా-గ్లూకాన్ కలిగి ఉంటుంది..

బ్లాక్ బీన్స్:బ్లాక్ బీన్స్ ఒక రుచికరమైన ఆహారం మాత్రమే కాకుండా మీ శరీరంనకు అందించడానికి అనేక పోషకాలను కలిగి ఉంది. ఒక కప్పు బ్లాక్ బీన్స్ లో 15 గ్రాముల ఫైబర్ మరియు ప్రోటీన్ ఉంటుంది. దీనిలో కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు చాలా సమృద్ధిగా ఉన్నాయి.

శనగలు:భారతదేశం శనగలు యొక్క అతి పెద్ద ఉత్పత్తిదారు అని మీకు తెలుసా? దీనిలో ఫైబర్ యొక్క ఒక గొప్ప వనరు ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని నుండి అన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది మధ్య తూర్పు మరియు యునైటెడ్ స్టేట్స్ లో చాలా ప్రసిద్ది.

అవకాడో : అవెకాడో పండు ఈ పండు ఫైబర్ యొక్క చాలా మంచి వనరుగా చెప్పవచ్చు. మొత్తం పండులో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ పండులో క్రీమీ ఫ్లెష్ ఉండుట వల్ల కొలెస్టరాల్ తగ్గించటానికి సహాయం చేస్తుంది మరియు గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతేకాక మంచి కొవ్వులు కలిగి ఉంటుంది.

 బ్రోకలీ:మీరు అనేక వంటకాల్లో బ్రోకలీని తప్పనిసరిగా వాడాలి. ఇది ఫైబర్ యొక్క ఒక గొప్ప మూలం మరియు క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.ఒక కప్పు ఉడికించిన బ్రోకలీలో 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది.


బార్లీ : అవును,కేవలం బార్లీ బీర్ మరియు విస్కీల ఒక ముడి పదార్ధం కాదు. కానీ దీనిలో ఫైబర్ యొక్క ఒక గొప్ప మూలం ఉంది. గుండె వ్యాధులు ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రసిద్ధి చెందింది. ఇది బీటా గ్లూకాన్ యొక్క ఒక మంచి మూలంను కలిగి ఉంది. మీరు మీ అల్పాహారంలో బార్లీ తీసుకుంటే మీకు రోజు ఆకలి తక్కువ  ఉన్న అనుభూతి కలుగుతుంది.. 
ఎండు ద్రాక్ష: ఈ మల బద్దక సమస్యకు ఎండు ద్రాక్ష ఎంతో ఉపయోగపడుతుంది, దీనిలో ఉన్న లక్షణాలు మన కండరాలను ఉత్తేజపరచి, పెద్ద ప్రేగు ద్వారా వ్యర్ద పదార్దాలని పంపించేస్తుంది.5 ఎండు ద్రాక్షలో 3 గ్రా.ము పీచు పదార్దం ఉంటుంది.

కాఫీ మరియు ఇతర వేడి ద్రవాలు: కాఫీ మన ఆరోగ్యానికి ఏ రకంగాను సహయపడక పొయిన మనలోని ఒత్తిడిని తగ్గించి, మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.అయితే ఈ మలబద్దక సమస్య నిర్మూలనలోను కాఫీ ఎంతగానో సహాయపడుతుంది, అంతే కాకుండా ఇతరత్రా వేడి పదార్దాలు తీసుకోవడంలోను ఈ సమస్య నుంచి మంచి ఫలితం లభిస్తుంది.

నీరు: మనం పీచు పదార్దం ఎంత తీసుకున్నప్పటికీ, దానికి తోడు నీరు కూడా తీసుకోవాలి,లేదంటే కడుపులో ఉన్న వ్యర్ద పదార్దాలు శుబ్ర పడకుండా అధిక నొప్పితో మలబద్దకముకు దారి తీస్తుంది.పండ్ల ముక్కల్ని నీటితో కలిపి తీసుకుంటే  మంచి ప్రభావం చుపిస్తాయి.

రాత్రి పూట పడుకునే ముందు 1 గ్లాసు వేడి పాలు తాగి పడుకుంటే మీ జీర్ణాశయం శుబ్రపడి, మంచి ప్రబావం చుపిస్తుంది.

గమనిక: 


ఒకవేళ పైన చెప్పిన ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నప్పటికీ మలబద్దకం తీవ్రత తగ్గకపోతే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం శ్రేయస్కరం.  


- చికిత్స చేయని యెడల శరీరం లో అమ్మోనియా స్థాయి పెరుగుతుంది. తద్వారా ఎప్పుడు మత్తు గా  ఉండటం, నీరసం గా ఉండటం గమనించవచ్చు . 

- మొలలు ఏమైనా వున్నపుడు వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోండి. 

- పేగు కి సంబందించిన ఏ ఇతర సమస్యలు అయినా కాలోనోస్కోపీ (colonoscopy) అనే టెస్ట్ ద్వారా తెలుస్తుంది. 


No comments:

Post a Comment

Featured post

వర్జిన్ కోకోనట్ ఆయిల్ (Virgin Coconut Oil) ఉపయోగాలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.

హాయ్!  ఈరోజు వర్జిన్ కోకోనట్ ఆయిల్(Virgin Coconut Oil)  గురించి తెలుసుకుందాం :  మార్కెట్ లో దొరికే సాధారణ కొబ్బరి నూనె కంటే ఇది విభి...