Saturday 7 April 2018

ఆల్కహాల్ విత్ డ్రాయల్ సిండ్రోమ్ (Alcohol Withdrawal Syndrome)అంటే ఏమిటి? అకస్మాత్తుగా ఆల్కహాల్ తీసుకోవడం ఆపు చేస్తే ప్రమాదమా?

ఆల్కహాల్ విత్ డ్రాయల్ సిండ్రోమ్ అంటే   ఏమిటి? అకస్మాత్తుగా ఆల్కహాల్ తీసుకోవడం ఆపేస్తే  ప్రమాదమా? 


ఆల్కహాల్ విత్ డ్రాయల్ సిండ్రోమ్ అంటే అనేక ప్రమాద లక్షణాల కలయిక . వ్యాధి యొక్క లక్షణాలు నిరంతరం ఆల్కహాల్ తాగే అలవాటు గల వ్యక్తులను ప్రభావితం చేస్తాయి. 

వీరు అకస్మాత్తు గా ఆల్కహాల్ ని తీసుకోవడం ఆపు చేయలేరు , అలాగని మోతాదు ని తగ్గించలేరు. వీరిలో వారి సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ (కేంద్ర నాడీ వ్యవస్థ) శరీర రక్త ప్రవాహం లో ఆల్కహాల్ ఉనికి కి అలవాటు పడిపోతుంది . ఆల్కహాల్ తీసుకున్నపుడు వీరి మెదడు యొక్క డిప్రెషన్ ప్రభావాల్ని తగ్గి , అసాధారణ స్థితి లో ఆక్టివ్ అవుతుంది. 

ఎప్పుడైతే , శరీరం లో  ఆల్కహాల్ స్థాయి తగ్గిపోయినప్పుడు , మెదడు అధిక ఉద్రేక స్థితి లో ఉండిపోతుంది, దాని లక్షణాలు శరీరం పై చూపుతుంది . 


కారణాలు ( Causes) : 

ఎక్కువ  గా ఆల్కహాల్ ని తాగడం వలన మెదడు లోని నాడీకణాలు ( సందేశాలు ను ప్రసారం చేసే రసాయనాలు) కు  అంతరాయం కలుగుతుంది. ఆల్కహాల్ వలన నాడీకణాల యొక్క  పనితీరు మరియు న్యూరాన్ కార్యాచరణ ని  క్రమేణా తగ్గిస్తూ వస్తుంది .  తద్వారా ఆల్కహాల్ ని తీసుకోవడం వల్ల అసాధారణ , అసంబద్ధమైన ఉద్రేక ప్రవర్తన ని కలగజేస్తుంది. ఇలా ఎక్కువ రోజులు ఆల్కహాల్ ని తీసుకోవడం వల్ల బ్రెయిన్ యొక్క నాడి వ్యవస్థ స్పందన  తగ్గుతుంది . మరియు కావాల్సిన ప్రభావాన్ని పొందడానికి  అధికం గా ఆల్కహాల్ ని తీసుకోవాల్సి వస్తుంది . ఆల్కహాల్ మీద ఆధారపడి జీవించాల్సి వస్తుంది ,  ఈ స్థితి నే  ఆల్కహాల్ డిపెండెన్సీ సిండ్రోమ్ ( Alcohol Dependency Syndrome) అని  అంటారు. 

ఆల్కహాల్ విత్ డ్రాయల్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఆందోళన, చికాకు, మరియు వణుకుడు, మూర్ఛ రావడం . 




😰లక్షణాలు (Symptoms): 


ఆల్కహాల్ విత్ డ్రాయల్ లక్షణాల స్వభావం మరియు దాని యొక్క తీవ్రత ఆ వ్యక్తి ఇదివరకు ఎంత మోతాదు లో మరియు ఎంత కాలం గా ఆల్కహాల్ ని తాగుతున్నారో వాటి యొక్క అంశాలపై ఆధారపడి ఉంటుంది. 

ఈ లక్షణాలు సాధారణం గా ఆల్కహాల్ ఆపివేసిన లేదా మోతాదు ని తగ్గించిన కొన్ని గంటల్లోనే కనిపించవచ్చు.

ఉదాహరణ కి,

  • వణుకుడు,😰
  • వెంటనే ఆల్కహాల్ ని తాగాలనే బలమైన  కోరిక, 😌
  • నిద్ర పట్టకపోవడం,😪
  • విచిత్రమైన కలలు , ( Nightmares) 😨😱
  • ఆతురత (Anxiety)😲, 
  • చికాకు ( Irritation), 😡
  • ఆకలి మందగించడం , 😷
  • వికారం మరియు వాంతులు, 😷
  • తలనొప్పి, 😬
  • చెమటలు పట్టడం.. 😠




➽వ్యక్తి ఆల్కహాల్ ని ఆపివేసిన 12 నుంచి 24 గంటల తర్వాత వారు శ్రవణ, దృశ్య లేదా స్పర్శ సంబంధిత మతిభ్రమణ ల ను అనుభవించవచ్చు . ఈ లక్షణాలు సాధారణం గా 48 గంటల్లో సమసిపోతాయి. ఈ స్థితి నే ఆల్కహాల్ మతిభ్రమ అంటారు.

➽ఆల్కహాల్ మానేసిన 24 నుంచి 48 గంటల్లో మూర్ఛలు రావడం కూడా గమనించవచ్చు. కొన్నిసార్లు ఇవి కేవలం 2 గంటల్లోనే సంభవంచడం చూడొచ్చు.

➽గందరగోళం , గుండె వేగం గా కొట్టుకోవడం ( పాల్పిటేషన్స్ ) మరియు జ్వరం వంటి డెలీరియం ట్రేమోర్స్  లక్షణాలు సాధారణం గా ఆల్కహాల్ ఆపేసిన 2-4 రోజుల్లో ప్రారంభమవుతాయి.

➽వీటితో బాధపడుతున్న వారు సుమారు 1-5% మంది రోగులు మెటబోలిక్ లేదా గుండె సంబంధిత సమస్యలు , ఇన్ఫెక్షన్స్ మరియు గాయం వలన మరణిస్తారు.



ఎలా నిర్ధారిస్తారు? ( Diagnosis) 

డాక్టర్ కి  మీ సమస్యలు గురించి చెప్పడానికి సంకోచించకండి. మీరు ఎన్ని రోజులనుండి ఆల్కహాల్ ని తాగుతున్నారు? మరియు ఎంత మోతాదు రోజుకి తీసుకుంటున్నారో చెప్పండి. మరియు ఆల్కహాల్ చివరిసారి ఎప్పుడు  తీసుకున్నారో కూడా చెప్పండి. 

శారీరకం గా పరీక్ష చేసి , మీ వైద్య చరిత్ర ను  పరిశీలించిన పిమ్మట ,మీకు అవసరమైన టెస్ట్ లు చేయించాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్ , సంపూర్ణ రక్త కణాల సంఖ్య , ఎలెక్ట్రోలైట్స్ , ఆల్కహాల్ స్థాయి మొదలగును రక్త పరీక్ష లు , అలాగే మూత్ర విశ్లేషణ ని కూడా సిఫారసు చేయవచ్చు. ఆల్ట్రాసౌండ్ స్కాన్ కూడా అవసరం అవుతుంది. 

వీటి ఫలితాలు ఆధారం గా ఆల్కహాల్ విత్ డ్రాయల్ అవునో కాదో , ఒకవేళ అయితే అది ఏ స్థాయి లో ఉందొ కూడా నిర్ధారించుకోవచ్చు. 



చికిత్స: (treatment ) 

ఏదైనా చికిత్స ని మొదలుపెట్టేముందు రోగి యొక్క విత్ డ్రాయల్ లక్షణాలు దశ ని క్షుణ్ణం గ అంచనా వేయాలి. మానసికమైన సమస్యలు కూడా  ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. 

కొద్దిపాటి నుండి మిత స్థాయి కి విత్ డ్రాయల్ లక్షణాలు వున్నట్లైతే వైద్యులు అవుట్ పేషెంట్ విధానం లోనే చికిత్స చేస్తారు. ఇంపేషెంట్  డీ టాక్సిఫికేషన్ తో పోల్చినపుడు అవుట్ పేషెంట్ చికిత్స అనేది సులభం. , సురక్షితం , సౌకర్యవంతం, ప్రభావవంతం కూడా. 

కింది సందర్భాల్లో ఇన్ పేషెంట్ విధానం   లో చికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు. 

➤రోగి ఒకవేళ గర్భిణీ మహిళా అయినపుడు, 

➤తీవ్రమైన విత్ డ్రాయల్ లక్షణాలు , విత్ డ్రాయల్ మూర్ఛలు వంటి చరిత్ర కలిగి వున్నపుడు,

➤మానసికమైన పరిస్థితులతో భాధపడుతున్నపుడు , 

➤డాక్టర్ లు వణుకుడు , ఆందోళన, మరియు గందరగోళాన్ని అదుపు లో ఉంచడానికి మరియు మూర్ఛలు మరియు డీటాక్సిఫికేషన్స్ యొక్క ప్రమాదవకాశాలను తగ్గించడానికి ఉపశమన మందులు సూచించవచ్చు. 




డాక్టర్స్ ఈ కింది మందుల్ని సూచించవచ్చు : 


  • మూర్ఛ నుంచి ఉపశమనం కోసం యాంటీ కన్వెల్సంట్ ఏజెంట్స్ 
  • ఆందోళన నుంచి ఉపసమనం పొందడానికి యాంటీ సైకోటిక్స్ మందులు 
  • పెరిగిన రక్త పోటు ని తగ్గించడానికి బీటా - బ్లాకెర్స్ 


నివారణ: ( prevention ) 


  • 1. విత్ డ్రాయల్ లక్షణాలకి పూర్తిగా చికిత్స తీసుకోవడం. 
  • 2. ఆల్కహాల్ విత్ డ్రాయల్ సిండ్రోమ్ సంభవించడానికి అంతర్లీన కారణం ఆల్కహాల్ వ్యసనం . కనుక , రోజు ఎక్కువ మోతాదు లో ఆల్కహాల్ ని తాగకుండా ఉండటం వల్ల దీనిని నివారించవచ్చు. 
  • 3. ఆల్కహాల్ వ్యసనం కోసం వైద్య సహాయం ముందే  తీసుకోవడం వలన సమస్యల తీవ్రత కొంచెం వరకు తగ్గించవచ్చు. 



No comments:

Post a Comment

Featured post

వర్జిన్ కోకోనట్ ఆయిల్ (Virgin Coconut Oil) ఉపయోగాలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.

హాయ్!  ఈరోజు వర్జిన్ కోకోనట్ ఆయిల్(Virgin Coconut Oil)  గురించి తెలుసుకుందాం :  మార్కెట్ లో దొరికే సాధారణ కొబ్బరి నూనె కంటే ఇది విభి...