Sunday 15 April 2018

చిటెక లో జలుబు మరియు దగ్గు తగ్గిపోతుందా? Common "COLD" Symptoms,Treatment and Home Remedies.

చిటెక లో జలుబు , దగ్గు తగ్గుతుందా? సాధారణ జలుబుకు ఫ్లూ కి గల తేడా ఏమిటి? 


జలుబు, దగ్గు మన దైనందిన జీవితం లో అనేక రకాల ఇబ్బందులు కు గురిచేసి, మనశ్శాంతి లేకుండా  చేస్తుంది. జాబ్ చేసేటపుడు ఏకాగ్రత ను లోపించేలా చేస్తుంది. మన పక్కన వున్న వాళ్ళు కూడా విసుగుకుంటారు. అప్పుడే మనం చాలా తొందరగా తగ్గిపోయే మందుల కోసం వెదుకుతాం. అస్సలు చిటెక లో జలుబు తగ్గుతుందా ? అది తెలియాలంటే మనం జలుబు ఎలా వస్తుంది, ఎలా నివారించవచ్చు , చికిత్స ఏంటి అనేది తెలుసుకోవాలి. 

జలుబు ఒక్కసారి వచ్చిందంటే దాదాపు 7-10 రోజులు వరకు ఉంటుంది, కొన్ని సార్లు ఇంకా ముందు గానే తగ్గిపోవచ్చు . అది మన శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తి పై ఆధారపడి ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ గల వారికి జలుబు చాలా తరుచుగా వస్తూ ఉంటుంది మరియు వెంటనే తగ్గదు. 

సాధారణ జలుబు మరియు ఫ్లూ లక్షణాలు మొదట్లో ఒకేలా ఉంటాయి. రెండూ కూడా శ్వాసకోశ వ్యాధులు అయినప్పటికీ ఇంచుమించు ఒకేలాంటి లక్షణాలని కలిగిఉంటాయి. రెండు  వ్యాధులు  రెండు వేర్వేరు వైరస్ ల వల్ల వస్తాయి, కానీ క్రమేణా వాటి యొక్క లక్షణాల ఆధారం గా వ్యాధి ని నిర్ధారిస్తారు.  

సాధారణ జలుబు మరియు ఫ్లూ కలిగించే ఒకేరకమైన లక్షణాలు: 

⭆ ముక్కు దిబ్బడ,
⭆ విపరీతమైన తుమ్ములు,
⭆ ఒళ్ళు నొప్పులు,
⭆ సాధారణ అలసట,
⭆ తక్కువ డిగ్రీ లో జ్వరం. 
ఒకవేళ ఫ్లూ అని నిర్ధారణ అయితే , సాధారణ జలుబు కంటే ఇంకా తీవ్రమైన లక్షణాలు కలిగి వుంటుంది. రెండిటికి తేడా ఏంటంటే , వ్యాధి యొక్క లక్షణాల తీవ్రత పైన ఆధారపడి ఉంటుంది. సాధారణ జలుబు అయితే పైన పేర్కొనబడ్డ లక్షణాలు, లేదా అంతకంటే ఇంకాస్త ఎక్కువ తీవ్రత ని కలిగి ఉంటుంది. కానీ, ఫ్లూ మాత్రం సైనస్ , చెవి ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా, సెప్సిస్ వంటి ప్రమాదకర స్థితుల ను  తెచ్చును. 

వ్యాధి నిర్ధారణ కి వెంటనే వైద్యుని సంప్రదించండి , మీ లక్షణాలు ని , మీ మెడికల్ హిస్టరీ  ఆధారం గా అవసరమైన పరీక్షలు నిర్వహించి , మందులు తీస్కోండి. 
మీ వైద్యుడు ఒకవేళ సాధారణ జలుబు అని నిర్ధారిస్తే, ఉపశమనానికి మందులు వాడితే 2-3 లేదా 3-5 రోజుల్లో తగ్గిపోతుంది. ఎన్ని రకాల మందులు వాడినప్పటికీ చిటెక లో అయితే చికిత్స చేసి తగ్గించలేరు. 

ఫ్లూ అయితే ఉపశమనానికి వాడే మందులతో పాటు antivral మందులు నిర్ణీత సమయం వరకు వాడాల్సి వస్తుంది. దానితో పాటు శరీరానికి కావాల్సిన ద్రవపదార్థాల్ని  , మరియు రెస్ట్ తీసుకోవడం చాల ముఖ్యం. 

జలుబు లక్షణాలు: 

* ముక్కు నుంచి కారడం, 
* ముక్కు దిబ్బడ , 
* ఆహారం రుచిని మరియు వాసన ని కనిపెట్టలేక పోవడం. 
* తుమ్ములు,
* దగ్గు 
* చలి పెట్టడం, 
*  ఛాతి అసౌకర్యం  
*  Post Nasal drip  
*  Lymph node enlargement. 
* తలనొప్పి 
* కంటి నుంచి నీరు కారడం. 
* గొంతు నొప్పి 
* అలసట 
* ఒళ్ళు నొప్పులు 
* జ్వరం రావడం 
* శ్వాస తీసుకోవడం లో అసౌకర్యం

జలుబు నివారణ మరియు చిట్కాలు:
జలుబు మరియు దగ్గు వలన కలిగే సమస్యలు మనల్ని మనశ్శాంతిని కలిగించవు. వీటి నుండి త్వరగా ఉపశమనం పొందాలనుకుంటాము. ఇక్కడ తెలిపిన ఔషదాలు  ఈ సమస్యను దూరం చేస్తాయి

Over The Counter Medicine  జలుబు చికిత్స : 
సాధారణం గా జలుబు కి Decogestants , యాంటీహిస్టమిన్స్, మరియు పెయిన్ కిల్లర్స్ వాడుతారు. ఇవి కొన్నిసార్లు కాంబినేషన్ తో ఉంటాయి. ఏ మందులు అయినా  వైద్యుని సంప్రదించి, తీసుకోవడం  మంచిది. 

గృహ చిట్కాలు : 


1. గోరు వెచ్చని నీటిలో, చిటికెడు ఉప్పు వేసి  నోరు బాగా పుక్కిలించడం. ఇలా రోజు కి వీలైనన్ని సార్లు చేయడం వల్ల  వెంటనే ఉపశమనం లభిస్తుంది. తగినంత ద్రవపదార్థాల్ని తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడం వల్ల తొందరగా కోలుకుంటాం. 


2. పసుపు: పసుపు కలిపిన పాలు తీసుకోవడం , ఇది భారతదేశం లో బాగా ప్రాముఖ్యం పొందిన ఆంటిబయోటిక్ అని చెప్పవచ్చు.  అంతే కాదు , ఇది ఆంటివైరల్, యాంటీఫంగల్, మరియు anti inflammatory లక్షణాలని విస్తృతం గా కలిగివుండటం వలన, రోజూ పాలలో ఒక చెంచా పసుపు కలుపుకుని తాగడం వల్ల జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. 

3. అల్లము : అల్లం కూడా బాగా ప్రాచుర్యం పొందిన ఔషధం, అల్లం తో చేసిన టీ తీసుకున్న వెంటనే జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. 

నివారణ : 

1. చేతులు శుభ్రం గా కడుక్కోండి. Antibacterial  ఏజెంట్స్ వాడటం వల్ల  ప్రమాదకర బాక్టీరియా , వైరస్ వంటి వాటినుండి కాపాడుకోవచ్చు . 

2. అపరి శుభ్రమైన ఆహారాన్ని తీసుకోకండి. 


3. జలుబు తో భాధ పడుతున్న వారి నుండి కాస్త దూరం గా వుండండి. తప్పనిసరి పరిస్థితులలో  మాస్క్ వాడండి, తరువాత చేతులని శుభ్రపరుచుకోండి. 



4. జలుబు దగ్గు తో భాధ పడుతున్నప్పుడు తప్పనిసరి గా మాస్క్ ని వాడండి, దగ్గుతున్నపుడు చేతిరుమాలు ని అడ్డు పెట్టడం వల్ల  ఇతరులకి వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు. 

No comments:

Post a Comment

Featured post

వర్జిన్ కోకోనట్ ఆయిల్ (Virgin Coconut Oil) ఉపయోగాలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.

హాయ్!  ఈరోజు వర్జిన్ కోకోనట్ ఆయిల్(Virgin Coconut Oil)  గురించి తెలుసుకుందాం :  మార్కెట్ లో దొరికే సాధారణ కొబ్బరి నూనె కంటే ఇది విభి...