Monday 9 April 2018

కొవ్వు మంచిదే...!! 

అధిక బరువు తో ఇబ్బంది పడుతున్నారా? 



అవునండీ..మీరు విన్నది నిజమే, మనం తీసుకునే రోజువారీ ఆహారం లో కాసింత కొవ్వు మంచిదే..!! 

మన రోజు వారి ఆహారపు అలవాట్లలో "కొవ్వు తో కూడిన ఆహరం" అనగానే, ఎక్కడ బరువు పెరుగుతామో అని భయపడి పక్కన పడేస్తాం. నిజానికి మన శరీరము  బరువు ప్రమాద స్థాయి కి  ఎప్పుడు పెరుగుతుందో తెలుసా? అయితే ఒక్కసారి గమనించండి, మన శరీరానికి తన రోజు వారి కార్యక్రమాలకి 1500 cal  శక్తి  కావాలనుకుందాం, కానీ మనం  ఆహరం ద్వారా 2500 cal  శక్తి  ని అందించాము , అపుడు మన శరీరం 1500cal  ని వినియోగించుకుని మిగిలిన  1000 cal  ని కొవ్వు రూపం లో భవిష్యత్ లో  శరీరం  యొక్క అవసరాలకి దాచి  ఉంచుకుంటుంది. ఇలా రోజూ ఆహారం అవసరానికి మించి  ఎక్కువ  తీసుకున్నట్లైతే మన శరీరం లో  కొవ్వు నిల్వలు పెరిగి అసాధారణ స్థాయి లో బరువు పెరగడం జరుగుతుంది. 

మీరు ఎంత  బరువు వున్నారో ఒక్కసారి గమనించండి, మీరు ఆరోగ్యకరమైన బరువు ని కలిగి వున్నారా లేదా అన్నది BMI calculator ద్వారా తెలుసుకోవచ్చు. దానికి మీ బరువు మరియు పొడవు ఎంత వున్నారో తెలిస్తే సరి, BMI calculator ద్వారా ఎంత వున్నారో సరిచూసుకోండి. 

  BMI  విలువ 
* <16 కంటే తక్కువ ఉంటే, Very Severely Underweight  
* 16.0 నుండి 16.9 అయితే severely Underweight  
* 17.0 నుండి 18.4 వరకు Underweight  
* 18.5 నుండి 24.9 వరకు ఆరోగ్యకరమైన బరువు ని కలిగియున్నారు. (Normal Weight) 
*25.0  నుండి 29.9 మధ్య లో ఉంటే Over weight  
*30.0 నుండి 34.9 వరకు "Obese class -1 "
*35.0 నుంచి 39.9 వరకు అయితే అది "obese class -2" 
*40< కంటే ఎక్కువ అయితే Morbid  Obesity  అని పిలుస్తారు. 


బరువు తగ్గాలనుకుంటున్నారా? అన్ని రకాల డైట్ ప్లాన్ లు ప్రయత్నించి విసిగిపోయారా? కొంగారు పడకండి . 
మీకు ఉపయోగపడే కొన్ని టిప్స్ ఇక్కడ వున్నాయి, ప్రయత్నించి చూడండి. 

1. Don't skip Your Meal : బరువు తగ్గడం కోసం కావాలని ఆహారాన్ని మానేయకండి. అది ప్రమాదకరం. 

2. కొంచెం ఆహారం అయినప్పటికీ చాలా తక్కువ  తక్కువ మోతాదు లో, ఎక్కువ సార్లు తీసుకోండి. ఇలా చేయడం వల్ల రోజు లో ఎక్కువ గా ఆకలి అవ్వదు. 

3. మీ ఆహారాన్ని ఇంట్లో నే తయారు చేసుకోండి. బయట ఫుడ్స్ కి ఆకర్షితమయ్యి అలవాటు పడకండి. 

4. ఆరోగ్యకరమైన ఫుడ్స్ ని ముందు గానే ఇంట్లో తయారు చేస్కుని వుండండి . అవసరమైనపుడు మల్లి మల్లి వండాల్సిన అవసరం లేకుండా, ఆకలి వేసినపుడు snacks  రూపం లో తినొచ్చు. 

5. మీరు తింటున్న డైట్ లో మనకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, ఫ్యాట్స్ సమపాళ్లలో  ఉన్నాయో లేదో సరిచూసుకోండి. (Balanced Diet) 

6. చిన్న ప్లేట్ లో ఆహరం తీసుకోండి. డైట్ కి ప్లేట్ పరిమాణం కి సంబంధం ఉందండి, ఇటీవల అసోసియేషన్ ఆఫ్ కన్స్యూమర్డ్ అండ్  రీసెర్చ్ వారు చేసిన పరిశోధనల ఆధారం గా, ప్లేట్ సైజు చిన్నది గా ఉండటం  వల్ల  మనం తీసుకునే ఆహరం పరిమాణం కూడా తగ్గడం గమనించారు.  తమాషా గా వుంది  కదూ ...!! 

7.   ఖాళీ కడుపు తో, ఆకలి తో  పార్టీ లకి  అస్సలు వెళ్ళకండి. ఏదైనా కాస్త ఆరోగ్యకరమైన snacks  తిని వెళ్ళండి. 

8. ఆహరం లో ఉప్పు మరియు చక్కర మోతాదు ని తగ్గించండి. 

9. పండ్లు మరియు కూరగాయలుని విరివి గా వాడండి. 

10. అధిక కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ ని తగ్గించండి. లేదా ఆపేయండి. 

11. మద్యం సేవించడం తగ్గించండి, వీలైతే మానేయడం ఇంకా మంచిది. 


అన్నిరకాల డైట్ ప్లాన్స్ ని ప్రయత్నించారా , అయినా ప్రయోజనం లేదా... అయితే ఈ క్రింది కారణాల ద్వారా కూడా బరువు తగ్గడం కొంచెం కష్టం అవొచ్చు. 

* బరువు తగ్గడానికి డైట్ ఒక్కటే కాదు, వ్యాయామం కూడా తప్పనిసరి. తగినంత వ్యాయామం లేకపోతే మీరు ఎంత డైటింగ్ చేసిన వ్యర్థమే.



* హార్మోన్ల ప్రభావం- థైరాయిడ్ వంటి హార్మోన్స్ టెస్ట్ ఒక్కసారి చేయించుకోండి. 

* Obstructive Sleep Apnea (OSA) - నిద్ర లో మీకు గురక (Snoring)రావడం, పగలు మత్తు గా ఉండటం , fatigue వంటి లక్షణాలు వున్నచో స్లీప్ స్టడీ (Polysomnography) అనే  టెస్ట్ ద్వారా నిర్ధారణ చేస్తారు. దీనివల్ల కూడా బరువు పెరుగుతూ ఉండొచ్చు.  

* మీరు వాడుతున్న మందు ల లో steroids వున్నపుడు కూడా బరువు పెరిగే అవకాశం వుంది. ఈ విషయం లో మందుల వాడకం గూర్చి  వైద్యుల సలహా  తీసుకోండి. 

* మీ లైఫ్ స్టైల్ లో stress  కి ఏమాత్రం చోటు ఇవ్వకండి. యోగా మరియు ప్రాణాయామా లాంటి  పద్ధతుల ద్వారా స్ట్రెస్ (stress ) ని కొంచెం తగ్గించవచ్చు. 

Weight loss Diet Plan బరువు తగ్గడం కోసం మీకొరకు ఇక్కడ ఆహారపు  ప్లాన్ తయారు చేయబడి వుంది.  

ఉదయం: 

6AM - Bullet Proof Coffee  అర్థం కాలేదా...? బులెట్ ప్రూఫ్ కాఫీ  ఎలా చేస్తారో తెలుసా? చాలా సులభం. 
1గ్లాస్ లో, సగం వరకు బ్లాక్ కాఫీ తీసుకోండి. (ఇందులో పాలు , చక్కర వేయకూడదు..  only డికాషాన్ ) మిగిలిన సగం డైరీ క్రీం ని తీసుకోవాలి. మిల్క్ క్రీం మనకు బయట మార్కెట్ లో సులభంగానే దొరుకుతుంది. మరియు వర్జిన్ కోకోనట్ ఆయిల్ ని 10ml  వేయండి. క్రమం గా 10ml నుండి 30ml వరకు పెంచుకోవచ్చు.రుచి కోసం కాస్త నిమ్మకాయ రసం వేసుకోండి. అంతే... 

Brief  గా , Bullet Proof Coffee తయారు చేయు విధానం : 
1 గ్లాస్ లో  1/2 బ్లాక్ కాఫీ (డీకాషన్ ) + 1/2 మిల్క్ క్రీం +10మి.లీ నుండి 30మి.లీ వరకు  వర్జిన్ కోకనట్ ఆయిల్. (రుచి కోసం కాస్త నిమ్మ రసం) - రోజు లో ఒక్కపూట మాత్రమే . 

7-8AM : అల్పాహారం : రెండు  కోడి గుడ్లు (యెల్లో సొన తో కూడా) - మీకు నచ్చిన విధం గా ఉడకబెట్టినవి లేదా ఫ్రై చేసింది లేదా బూర్జి టైపు అయినా పర్లేదు. 
ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే , 
1 జొన్న రొట్టె మరియు కూరగాయల కర్రీ.


10-11AM  : మధ్యలో ఆకలి వేస్తే బ్లాక్ కాఫీ తీసుకోండి. డికాషన్ మాత్రమే.


1-2PM  Lunch : ఒక కప్ నట్స్ తినండి . నట్స్ అంటే వేరు శనగలు, బాదాం, పిస్తా, ఆల్మండ్, cashew, ఆక్రోట్ మొదలగునవి. (30-40 గ్రాములు మాత్రమే) 

7-8PM  Dinner :  పచ్చి కూరగాయ ముక్కలు (పెద్ద ప్లేట్) వెజిటబుల్ సలాడ్ తినండి. కీరా, దోస, క్యారెట్,  ముల్లంగి, బీట్రూట్ వంటివి తీస్కోండి, రుచి కోసం కాస్త ఉప్పు, లేదా పెప్పర్ లేదా నిమ్మ రసం తీసుకోవచ్చు. 
దీనితోపాటు కచ్చితం గా 150 గ్రాములు చికెన్, లేదా మటన్, లేదా రొయ్యలు, లేదా చేపలు, లేదా కోడిగుడ్లు (యెల్లో తీయకుండా ), లేదా చీజ్, లేదా పనీర్, లేదా సోయా బీన్ తీసుకోవచ్చు.


గమనిక: 
*ఈ ఆహారపు నియమావళి సగటు ఆరోగ్యమైన మనిషి స్థూలకాయం తో భాధ పడుతున్నవారిని ఉద్దేశించి తయారుచేయబడింది. 

* పైన పేర్కొనబడిన డైట్ ప్లాన్ ప్రముఖ గుండె డాక్టర్స్ మరియు న్యూట్రిషనిస్ట్స్  చే సిఫారసు చేయబడింది.  అయినప్పటికీ మీ వ్యక్తిగత వైద్యున్ని సంప్రదించిన తర్వాత నే ఈ ప్లాన్ ని అమలు చేయండి. 

* ఇదివరకే మీరు మధుమేహం తో భాధ పడుతున్నారా? ఒక్కసారి మీ మందుల చిట్టి ని వైద్యునికి చూపించి ఆ తర్వాత ఈ డైట్ ని మొదలు పెట్టండి.ఎందుకంటే మీ షుగర్ మందులలో "sulfonylurea drugs మరియు త్వరిత గతిన sugars ని తగ్గించే ఇన్సులిన్" కనుక ఉంటే అందులో మీ డాక్టర్ మార్పులు చేసే అవకాశం వుంది. ఎందుకంటే ఈ ఆహారపు నియమావళి ద్వారా శరీరం లోని షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. 

* కిడ్నీ మరియు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు  మీ డాక్టర్ సలహా తీసుకోండి. 

* ఆహారపు నియమావళి తో పాటు తగినంత వ్యాయామం చేయాలి. ఎక్కువ గా బ్రిస్క్ వాక్ చేయడానికి మొగ్గు చూపండి.  వీలైతే స్టేషనరీ సైక్లింగ్ కూడా చేయండి. 

No comments:

Post a Comment

Featured post

వర్జిన్ కోకోనట్ ఆయిల్ (Virgin Coconut Oil) ఉపయోగాలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.

హాయ్!  ఈరోజు వర్జిన్ కోకోనట్ ఆయిల్(Virgin Coconut Oil)  గురించి తెలుసుకుందాం :  మార్కెట్ లో దొరికే సాధారణ కొబ్బరి నూనె కంటే ఇది విభి...